Telugu Christian Devotional Songs

 


Aaradhana neeke Aaradhana Song - Lyrics


ఆరాధనా నీకే ఆరాధనా –ఆరాధనా యేసు అన్ని వేళలా//2//

నా కష్టాలలో ఆరాధనా –శోక సంధ్రములో నీకే ఆరాధనా

నా నష్టాలలో ఆరాధనా –లోకమే నను విడచిన నీకే ఆరాధనా

ఆరాధనా నీకే ఆరాధనా –ఆరాధనా యేసు అన్ని వేళలా //2//

1. ఓటములే నాకు మిగిలిన –కన్నీట నిండ మునిగినా

ఆదరించు ఏసుని చూస్తు ఆరాధనా

నా ప్రియులే చేయి విడచిన –సిరులున్నా లేక పోయినా

నన్ను విడువని ఏసుని చూస్తు ఆరాధనా

యేసయ్యా నీకే నా ఆరాధన ఏసయ్యా నీకే నా స్తుతి కీర్తన //ఆరాధనా//

2. రోగముచే క్షీణించినా –శాంతిలేక కుమిలిపోయినా

సర్వమును భరించు యేసుకే ఆరాధనా

శొధనలే చుట్టుముట్టినా –పాపములే రాజ్యమేలినా

లోకాన్ని గెలిచిన ఏసుకే ఆరాధనా

యేసయ్యా నీకే నా ఆరాధనా ఏసయ్యా నీకే నా స్తుతి కీర్తన //ఆరాధనా//